రాజధానిలో ల్యాండ్ మాఫియా చేస్తు అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే

రాజధానిలో ల్యాండ్ మాఫియా చేస్తు అడ్డంగా దొరికిన వైసీపీ ఎమ్మెల్యే

0
85

అవినీతి అక్రమాలకు తమ ప్రభుత్వంలో చోటు ఇవ్వకుండా పరిపాలన చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు…

దీంతో చాలామంది ఎమ్మెల్యేలు సక్రమంగా తమ విదులను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఒకరు భూ అక్రమాల వ్యవహారంలో వేలుపెడుతూ దందాలను సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ల్యాండ్ సెటిల్ చేసి ఘోరంగా ఓటమి చెందారు.

అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అదే పని చేస్తున్నారట. పెండింగ్ లో ఉన్న వాటిని తాను పంచాయితీ చేసి సెటిల్ మెంట్ చేస్తానని అంటున్నారట. రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ ఖచ్చితంగా ఓటమి చవిచూసే అవకాశం ఉందని అంటున్నారు.