చైనాకి భారత్ కి మధ్య వివాదం నడుస్తోంది, సరిహద్దు దగ్గర పరిస్దితి సీరియస్ గానే ఉంటోంది, అయితే ఈ సమయంలో మన ప్రభుత్వం 59 చైనా యాప్స్ కూడా నిషేదించింది., ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లడాఖ్ చేరుకున్నారు. ఆయన పర్యటన గురించి రక్షణ శాఖ అధికారులకు కూడా తెలీకపోవడం విశేషం.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన లేహ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె ఉన్నారు.
అయితే అత్యంత సీక్రెట్ గా ఈ విషయం ఉంచారు, ఎవరికి తెలియనివ్వలేదు.
లడాఖ్ లో తాజా పరిస్థితిని అంచనా వేసేందుకు మోడీ రంగంలోకి దిగారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం తెలియదంటే.. ఆయన ఎంత హఠాత్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయనతో అక్కడ ఆర్మీ అధికారులు భేటీ అయ్యారు, అక్కడ పరిస్దితి గురించి వివరించారు. చైనా దూకుడుకి కళ్లెం వేసేందుకు రంగంలోకి నేరుగా ప్రధాని దిగారు అంటున్నారు నిపుణులు.