బిజెపికి షాక్ : రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ చేరిన ఆ జిల్లా నేతలు

0
93

బిజెపి పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో సత్తుపల్లికి చెందిన బిజెపి నేతలు కాంగ్రెస్ లో చేరారు. గురువారం సాయంత్రం సత్తుపల్లి నియోజకవర్గం కిష్టారం మాజీ సొసైటీ ఛైర్మన్ రావి నాగేశ్వరరావు, కిష్టారం మాజీ సర్పంచ్ ప్రత్తిపాటి భిక్షపతి, యువజన నేత పుచ్చకాయల లక్ష్మారెడ్డి లు బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరారు.

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కండవాలు కప్పి వారిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల్లో చేరిన కాంగ్రెస్ నేతలంతా సొంత గూటికి చేరాలని పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డిపై నమ్మకం తో పార్టీలో చేరుతున్నట్లు రావి నాగేశ్వరరావు, భిక్షపతి,లక్ష్మారెడ్డి, లు పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం నిత్యావసర ధరలు మరియు పెట్రోల్ డీజిల్,వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి పై భారం మోపడం నచ్చక, కోవిడ్ నియంత్రణ లో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందటం వల్ల కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ల నేతృత్వంలో బిజెపి నేతలు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గం ఆత్మకమిటీ మాజీ ఛైర్మన్ నున్నా రామకృష్ణ ,సత్తుపల్లి సొసైటీ ఉపాధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, టిపిసిసి మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఎండి రషీద్, సీనియర్ కాంగ్రెస్ నాయకు పింగుల సామేలు పాల్గొన్నారు.