స్కూళ్లు స్టార్ట్ అయితే కేంద్రం రూల్స్ ఇలాగే ఉంటాయట?

స్కూళ్లు స్టార్ట్ అయితే కేంద్రం రూల్స్ ఇలాగే ఉంటాయట?

0
34

ఈ లాక్ డౌన్ వేళ మార్చి 20 నుంచి దేశంలో స్కూల్స్ కాలేజీలు ఓపెన్ అవ్వడం లేదు, దీంతో పాఠశాలలు అన్నీ మూసేశారు, కొందరు మాత్రమే ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నారు, ఇక వచ్చే నెలలోనే అకడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, క్లాసులు ప్రారంభం కావాలి.. కాని ఈసారి ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు, స్కూల్స్ కు మరింత సమయం పడుతుంది అంటున్నారు.

ఒకవేళ స్కూల్స్ తెరిచినా కేంద్రం పలు రూల్స్ తీసుకువస్తుంది.. వాటిని స్కూల్స్ పిల్లలు తల్లిదండ్రులు పాటించాల్సిందే. మరి ఆ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే, కచ్చితంగా క్లాసుకి 20 లేదా 25 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉండాలి. ఇక మాస్క్ ధరించాలి, స్టూడెంట్స్ భౌతిక దూరం పాటించాలి, క్లాసులో ఈ విషయాలు టీచర్లే చెప్పాలి, మాస్క్ తీసుకురాకపోయినా భౌతిక దూరం పాఠించకపోయినా ఫైన్ అని తెలియచేయాలి.

మాస్కులు శానిటైజర్లు వాడటం తప్పనిసరిచేస్తారు, అలాగే స్కూళుకు పిల్లల్ని తల్లిదండ్రులే స్వయంగా తీసుకురావాలి.. ఇక స్కూళ్లు రోజు శానిటైజ్ చేయాలి, వారానికి ఆరు రోజులు స్కూల్స్ జరుపుతారు,
భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి. ఇవన్నీ కొత్త రూల్స్ తీసుకువస్తారని తెలుస్తోంది