మండలి చైర్మన్ షరీఫ్ రాజీనామా చేస్తారా ?

మండలి చైర్మన్ షరీఫ్ రాజీనామా చేస్తారా ?

0
48

ఏపీలో రాజకీయంగా ఇప్పుడు శాసన సభ శాసన మండలిలో ఈ రాజధాని బిల్లుపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ముందుకు సాగిన ఈ బిల్లు ఇప్పుడు మండలిలో మాత్రం ముందుకు వెళ్లలేదు, చంద్రబాబు అసెంబ్లీలో మఖ్యంగా సభలో సక్సెస్ కాలేదు.. కాని మండలిలో మాత్రం విఫలం కాలేదు. పట్టుసడల కుండా చంద్రబాబు, మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు ఇద్దరూ కూడా వ్యూహాలు సిద్దం చేసారు.

చివరకు అనుకున్నది సాధించారు, అయితే తనకున్న విచక్షణాధికారంతో రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. అసలు రూల్ కు విరుద్దంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని విమర్శలు చేస్తున్నారు, న్యాయ పరంగా ముందుకు వెళతాం అంటున్నారు.

అంతేకాదు ఏజీతో చర్చించి ముందుకు సాగుతున్నారు, ఇక చైర్మన్ నిర్ణయం పై తెలుగుదేశం నేతలు రాజధాని రైతులు ఆనందంలో ఉన్నారు.. మరో పక్క అధికార వైసీపీ మాత్రం దీనిని విమర్శిస్తోంది. అయితే మండలిలో నిన్న జరిగిన విషయంలో చైర్మన్ అసహనంతో ఉన్నారు, అందుకే ఆయన రాజీనామా చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మనస్తాపానికి గురైన షరీఫ్ రాజీనామా చెయ్యాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని ఆయన చంద్రబాబుకి కూడా ఫోన్ లో చెప్పినట్టు సమాచారం. కాని పార్టీ సీనియర్ నేతగా బాబు ఆయనని వద్దు అని చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి.