చంద్రబాబుకు షాక్ శాసనమండలి చైర్మన్ రాజీనామా….

చంద్రబాబుకు షాక్ శాసనమండలి చైర్మన్ రాజీనామా....

0
81

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం… తాజాగా రాజధాని అభివృద్ది వికేంద్రీకరణ బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లును శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారు…

దీంతో రాజధాని తరలింపుకు బ్రేక్ పడింది… చైర్మన్ షరీఫ్ తన నిర్ణయాన్నిప్రకటించగానే వైసీపీ మంత్రులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు.. దీంతో కనీసం సభను వాయిదా వేస్తున్నట్లు చెప్పకుండా అక్కడనుంచి వెళ్లిపోయారు… అక్కడి నుంచి నేరుగా తన ఛాంబర్ కు వెళ్లి అక్కడి నుంచి బయటకు వెళ్లారు…

ఆ సమయంలో వైసీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్లు తెలిసింది… దీంతో ఆయన మనస్థాపం చెంది తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి