వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి షాక్

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి షాక్

0
120

ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నేతలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి.. ప్రచారాల హోరు కూడా అలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం వైసీపీ మధ్య వార్ నడుస్తోంది అని చెప్పాలి. ఎక్కడ రెండు పార్టీల నేతలు కనిపించినా ఇలాంటి వివాదాలే నడుస్తున్నాయి..తాజాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది.కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఈ విషయం తెలియడంతో సీబీఎన్ ఆర్మీ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.. వైసీపీ నాయకులు చేస్తున్న పనిని తప్పు అని, అక్కడ వారు వాదించినా వారు వినలేదు అని చెబుతున్నారు ఇక్కడ జనం.

ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. బాధితుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి తెలియగానే.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని బాధితుల్ని పరామర్శించారు. వైసీపీ నాయకులపై కొట్టిన కార్యకర్తలపై కేసు పెడతామని వారిని వదిలే ప్రసక్తే లేదు అని చెబుతున్నారు.30 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి తమపై బీరు బాటిల్స్ తో దాడి చేశారు అని వీరిని వదలకండి అని సీబీఎన్ ఆర్మీ సభ్యులు చెబుతున్నారు. వారు అందరూ కూడా ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరులు అని తెలియచేశారు ..వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడిలో పాల్గొన్న వైసీపీ నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎన్నికల్లో గెలిచేందుకు చెవిరెడ్డి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని విమర్శిస్తున్నారు