టీడీపీకి మరో షాక్ విశాఖలో కీలక నేత రాజీనామా

టీడీపీకి మరో షాక్ విశాఖలో కీలక నేత రాజీనామా

0
96

ఇక మరో పది రోజుల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు… అయితే ఈ సమయంలో చాలా మంది నేతలు గుడ్ బై చెప్పడం టీడీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి, తాజాగా విశాఖ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పంచకర్ల రమేష్బాబు పార్టీకి గుడ్ బై చెప్పారు. బుధవారం తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గంలో అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశంకానున్నారు..

ఇటీవల ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపించాయి .. ఇక నేరుగా ఆయన గుడ్ బై చెప్పారు, త్వరలో వైసీపీలో పంచకర్ల రమేష్ బాబు చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పంచకర్ల గతంలో చిరుతో సయోధ్యగా ఉండేవారు 2009లో పీఆర్పీలో చేరి పెందుర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన సంగతి తెలిసిందే. విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్తో పాటుగా పంచకర్ల రమేష్ టీడీపీలో చేరారు.. ఇక 2019 లో టీడీపీ నుంచి ఎలమంచిలిలో ఎమ్మెల్యేగా నిలబడ్డారు కాని వైసీపీ నేత కన్నాబాబు రాజు చేతిలో ఓడిపోయారు.