తెలంగాణ: మెదక్ జిల్లా ఏడుపాయల కిష్టాపురం వద్ద టెన్షన్ నెలకొంది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది పొంగిపొర్లుతోంది. కాగా ఈ నది మధ్యలో ఆరుగురు గొర్రెల కాపరులు, 1500 గొర్రెలు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే మంత్రి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కాగా కాపరులు నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన వారిగా గుర్తించినట్టు సమాచారం అందుతుంది.