5 రాష్ట్రాల పీసీసీలు రాజీనామా చేయండి..సోనియా గాంధీ సంచలన నిర్ణయం..

0
137

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓట‌మిని చవి చూసింది. అంతేకాకుండా అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం అయిన పంజాబ్ ను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు  పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సంస్కరణల దిశగా అడుగులు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్ ఓటిమి చెందిన ఉత్త‌ర ప్ర‌దేశ్, గోవా, ఉత్త‌రా ఖండ్, మ‌ణిపూర్, పంజాబ్ రాష్ట్రాల పీసీసీల‌కు షాక్ ఇస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఐదు రాష్ట్రాల పీసీసీలు వెంట‌నే రాజీనామా చేయాల‌ని ఆదేశించారు.

ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, అధికార ప్ర‌తినిధి సుర్జేవాలా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఉన్న పీసీసీల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేయాల‌ని సోనియా భావిస్తున్నార‌ని తెలిపారు. కాగ కాంగ్రెస్ పార్టీ సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా ముందుగు అడుగులు వేస్తుంద‌ని అన్నారు.