ఎస్పీవై రెడ్డి కన్నుమూత ఆయన చరిత్ర

ఎస్పీవై రెడ్డి కన్నుమూత ఆయన చరిత్ర

0
81

జనసేన నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు.. అనారోగ్యం కారణంగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధుల కారణంగా ఆయన మరణించారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.ఏప్రిల్ 3న ఆయన ఆస్పత్రిలో చేరారు, ఓ పక్క ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న సమయంలో ఆయనకు ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఆయనని హైదరాబాద్ లోకి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున ఎంపీగా నంద్యాల నుంచి పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ రాకపోవడంతో ఆయన జనసేన తరపున పోటీ చేశారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున నంద్యాల నుంచి ఎంపీగా గెలుపొందారు. తర్వాత వెంటనే ఆయన టీడీపీలో చేరారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన నంద్యాల పరిసర ప్రాంతాల్లో మంచి పేరు సంపాదించారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ , వైసీపీ అధినేత జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సేవాకార్యక్రమాలు అన్నదానం ఉచితంగా బోర్లు వేయించడం ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఆ ప్రాంతంలో ఎస్పీవై రెడ్డి.