సంచ‌ల‌నం న‌న్ను ఆ అధికార‌ ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడు

సంచ‌ల‌నం న‌న్ను ఆ అధికార‌ ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడు

0
83

శ్రీ రెడ్డి ఈ పేరు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతుంది. కొద్ది రోజులుగా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన రెండు సినిమాల హీరోయిన్ సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాన్ని చెప్పుకుంది. ఇప్ప‌టికే త‌న ద‌గ్గ‌ర ఎవ‌రైతే చ‌నువుగా ఉన్నారో వారి ఫోటోల‌ను కొంత మంది పేర్లను పేస్ బుక్ లో పోస్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. అంతేకాదు త‌నకు న్యాయం జ‌రగాల‌ని ప్ర‌ముఖ మీడియా స‌మావేశాల్లో అనే ఉద్య‌మాల‌ను కూడా చేసింది శ్రీ.

ఇక ఇరుతెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో త‌న‌ను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడ‌ని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పి రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ త‌న‌ను గతంలో ఆర్మూరు నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి లైంగికంగా వేధించాడ‌ని తెలిపింది.

అంతేకాదు ప్ర‌ముఖ నిర్మ‌త బెల్లంకొండ సురేష్ పేరును కూడా ప్ర‌స్తావించింది శ్రీరెడ్డి. వీరితో పాటు త‌న ద‌గ్గ‌ర చాల‌మంది పేర్లు ఉన్నాయ‌ని కాని ఇప్పుడు బ‌య‌ట పెట్టాల్సిన స‌మ‌యం కాద‌ని స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అన్ని పేర్లు బ‌య‌ట పెడ‌తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.