మే 23న జగన్ కు ఊహించని షాక్ తప్పదా

మే 23న జగన్ కు ఊహించని షాక్ తప్పదా

0
91

2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, మోదీ, పవన్ కలిసి పోటీ చేసిన సమయంలో అసలు జగన్ చరిష్మా ముందు వీరు ముగ్గురు ఎగిరిపోతారు అని, కచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు అని అన్నారు వైసీపీ నేతలు ..అయితే అప్పుడు బాబు చరిష్మాతో అక్కడ విజయం వచ్చింది. ఇప్పుడు కూడా ఆనాడు వచ్చిన సర్వేలు అన్నీ జగన్ సీఎం అవుతారు అని చెబుతున్నాయి. వాటిని చూపించి ఇక్కడ వైసీపీ నేతలు నవ్వులు పూయిస్తున్నారు. కాని వాస్తవ ఫలితాలు ఈవీఎంలలో ఉన్నాయి..ఈ సర్వేలను నమ్మము అని తెలుగుదేశం చెబుతోంది.

గత ఎన్నికల్లో జగన్ ఓడిపోయిన తర్వాత సాయంత్రం జగన్ మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ జనం చెబుతారు. జగన్ ఓటమి ఎలా ఉంటుందో ఆయన ఫేస్ లో చూపించారు. ఇప్పుడు ఆ పార్ట్ 2 కనిపిస్తుంది అని అంటున్నారు తెలుగుదేశం నేతలు. ఎక్కడా లేని హైప్ కావాలనే వైసీపీ నేతలు తీసుకువస్తున్నారు, నిజంగా రివర్స్ లో వైసీపీ దారుణంగా 30 నుంచి 40 సీట్లు మాత్రమే గెలుచుకుంటే పరిస్దితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి వైసీపీ నేతలు ఆలోచన చేసుకోవాలి అని అంటున్నారు.