తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

0
31

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది, ఎక్కడ చూసినా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి.. ఇక తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కూడా విధించారు, అయితే రాజకీయ నేతలు సినిమా నటులు ఇలా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు.. మరో పక్క పెద్ద ఎత్తున కేసులు బయటపడుతున్నాయి… అయితే టీకాల విషయంలో తెలంగాణ సర్కారు ఓ మంచి నిర్ణయం తీసుకుంది.

 

కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది… రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ను పూర్తిగా ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఇక ఏపీలో 18 సంవత్సరాల వయసు ఉన్న వారి నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారికి అందరికి ఉచితంగా వాక్సిన్ అందిస్తాము అన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్రంలోని నాలుగు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఉచిత వ్యాక్సిన్ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వంపై రూ. 2,500 కోట్ల భారం పడనుంది. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు, ఇక దీనిపై సీఎం కేసీఆర్ కోలుకున్న తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు అని తెలుస్తోంది. ఈ నిర్ణయం పై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.