వైసీపీ దుష్ర్పచారానికి టీడీపీ బ్రేకులు

వైసీపీ దుష్ర్పచారానికి టీడీపీ బ్రేకులు

0
64

ఓటమి భయం వైసీపీకి పట్టుకుంది.. ఎలాంటి పరిస్దితిలో అయినా ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని చూస్తున్నారు వైసీపీ నేతలు.. అంతేకాదు టీడీపీ విజయం వస్తే వైసీపీ ఇక బ్రతికి బట్టకట్టే ఛాన్స్ లేదు అని ఇటీవల సాయిరెడ్డి చేసిన కామెంట్లు కూడా తెలిసిందే… అయితే వైసీపీ కేడర్ సమస్య ఇంకా అలాగే ఉంది..తాజాగా సీఎం చంద్రబాబు ఏబీఎన్ రాధాకృష్ణ, మధ్య జరిగిన ఇంటర్యూలో ఓ మాట తీసుకుని అది ఎన్టీఆర్ కు ఆపాదించిన పదం అని వైరల్ చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ఎన్టీఆర్ ని కించపరిచే విధంగా మాట్లాడారు అని వీడియో ప్రచారం చేస్తున్నారు. దీనిపై తెలుగుదేశం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు సంబంధం లేని విషయాలను బయటకు తీసుకువచ్చి అసలు అనని దానిని కూడా చంద్రబాబుపై విషప్రచారంగా వైసీపీ చేస్తోంది అని విమర్శిస్తున్నారు. ఇటు వైసీపీకి తోడుగా జనసేన కూడా ఇలాంటి ఫేక్ వీడియోలను అనని మాటలను షేర్ చేస్తోంది.

వైఎస్ ఆరోగ్యశ్రీని మించిన పథకం పెట్టాలనుకున్నామని, అందులో ఒక సూచనగా ఆర్కేగారు ఆరోగ్యశ్రీకి మార్పులు చేసి మెరుగుపర్చాలని చంద్రబాబుకు సూచించారని టీడీపీ నేతలు చెబుతున్నారు, ఎన్టీఆర్ పేరు మార్చాలి అని ఉద్దేశ్యం లేదు అని కావాలనే వారు ఇలాంటి ఆలోచనలతో దుష్ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ నేతలు మండిపడ్డారు. వెయ్యికి పైగా వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చామని కావాలనే సాక్షిలో దీనిని సాకుగా చూపుతున్నారు అని విమర్శించారు టీడీపీ నేతలు.. జగన్ పత్రిక టీవీల్లో ఇలాంటి వార్తలు ఇస్తున్నారు అని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఖండించారు. అంతేకాదు తమకు ఎన్టీఆర్ పై అభిమానం లేకపోతే అన్నా క్యాంటీన్లు ఎలా పెడతామని ఆయన వివరించారు.