టీడీపీకి ఇంకో షాక్ రెడీ….

టీడీపీకి ఇంకో షాక్ రెడీ....

0
99

తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు త్వరలో టీడీపీ అధిష్టానం ఇంకో షాక్ కు రెడీ అవ్వాల్సి ఉందని అంటున్నారు… అదికూడా ప్రకాశం జిల్లానుంచే కావడం అందరిని అశ్చర్యానికి గురిచేస్తోంది… నిన్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే…

ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో షాక్ తగలనుందని వార్తలు వస్తున్నాయి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు ఆయన పార్టీలో చేరే విషయమై వైసీపీ నేతలకు టచ్ లోకి వెళ్లి వారితో చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి… అన్ని కుదిరితే రేపో మాపో ఆయన టీడీపీకీ రాజీనామా చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని అందరు చర్చించుకుంటున్నారు…