తెలుగుదేశం పార్టీకీ ఈసారి దారుణమైన పరాభవం వచ్చింది అనేది రిజల్ట్ చూస్తే తెలుస్తుంది.. అయితే ఈ ఎన్నికల్లో ఓటమితో టీడీపీకి మరో ఐదేళ్లే ప్రతిపక్షం సీటు ఫిక్స్ అయింది.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ లోకేష్ బాబు చేతికి పార్టీ బాధ్యతలు ఇస్తే పార్టీ ఎలా ముందుకు వెళుతుంది అనే ఆలోచన తెలుగుదేశం పార్టీనేతలకు ఉంది.
అందుకే చాలా మంది టీడీపీకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారట.. పార్టీ తరపున మరో నలుగురు నేతలతో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది.. అందులో ఇద్దరు బీజేపీ మరో ఇద్దరు వైసీపీలో చేరుతున్నారు అని తెలుస్తోంది. అయితే వైసీపీలోకి రాజీనామా చేసి వస్తారట.
మరి బీజేపీలోకి వారు ఎలాంటి కండిషన్లో వెళుతున్నారు అనేది తెలియడం లేదు ..అయితే వారికి వారే పార్టీ మారాలి అని భావిస్తున్నారట నాయకులు.. వైసీపీ బీజేపీ వైపు వెళితే మరో ఐదు సంవత్సరాలు రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని భావిస్తున్నారట ఈ నలుగురు నాయకులు