టీడీపీకి రెస్ట్ ఇక వైసీపీ వంతు బీజేపీ నయాప్లాన్

టీడీపీకి రెస్ట్ ఇక వైసీపీ వంతు బీజేపీ నయాప్లాన్

0
87

తెలుగుదేశం పార్టీ నాయకులని బీజేపీలోకి వరుస పెట్టి చేర్చుకునే కార్యక్రమం ఏపీలో కనిపిస్తోంది.. తెలుగుదేశం పార్టీ నుంచి, వైసీపీలోకి బీజేపీ లోకి నేతలు చేరిపోతున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీలో చేరడం తెలిసిందే , దానికి రివర్స్ గా బీజేపీలో కూడా చేరుతున్నారు, దీనికి కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం అనే చెప్పాలి… అందుకే నాయకులు ఆ పార్టీ వైపు కూడా అడుగులు వేస్తున్నారు.

చంద్రబాబుని రాజకీయంగా ఇప్పుడు వైసీపీ పెద్ద ఇరకాటంలో పడేస్తోంది, అయితే బాబుకి కాస్త రెస్ట్ ఇచ్చి ఇప్పుడు వైసీపీ ఆటకట్టించాలి అని బీజేపీ ప్లాన్ వేస్తోందట. ముఖ్యంగా తెలుగుదేశం నేతల కంటే వైసీపీ నేతలు ఎవరైనా పార్టీలో చేరాలి అని భావిస్తే వారిని పార్టీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారు.. అందుకే తమ పార్టీలోకి ఎవరైనా వస్తాము అంటే వారిని చేర్చుకోవడానికి బీజేపీ ముందుకు వస్తోంది. సో జగన్ కూడా జాగ్రత్త పడాలి అంటున్నారు మేధావి వర్గం.