జగన్ దెబ్బకు ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

జగన్ దెబ్బకు ఈ జిల్లాలో టీడీపీ ఖాళీ

0
86

ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీ, వైసీపీ నాయకులకు కీలకం ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీదే అధికారం అని అంటుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను సాధించి అధికారంలోకి రాగా 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించి వైసీపీ అధికాంలోకి వచ్చింది…

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వతా తమ్ముళ్లు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు తయారు అయ్యారు.. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఘోరంగా తయారు అయింది. గెలిచిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మరికొందరు నేతలు మినహా ఏ నాయకులు పార్టీకి అందుబాటులో లేకుండా ఉన్నారు…

70 ఏళ్ల వయస్సులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చలో ఆత్మకూరుకు పిలుపు నిచ్చారు… కానీ ఈ నినాదానికి ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పఎవ్వరు రాలేదు… ఇది ఇలానే కొనసాగితే పార్టీకి ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.