2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది . ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీ లోకి వలసలు ప్రారంభించారు . చంద్ర బాబు కూడా ఈ మధ్య ప్రజాసమస్యలపై పోరాటం లో కొద్దిగా వెనకడుగు వేస్తుండటం తో పార్టీ ని బలోపేతం చేసులోవాలనే ఆలోచన నేతల్లో పూర్తిగా తగ్గిపోయింది .
టీడీపీ ఎప్పుడైనా మునిగిపోయే పడవే అంటూ వైసీపీ గూటికి చేరడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు . అధికారికంగా వైసీపీ లో చేరకపోయిన ఆ పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో వేళ్ళు సపోర్ట్ ఇస్తున్నారట . టీడీపీ లో ఉంటె అచ్చం నాయుడుకి వచ్చిన పరిస్థితే వారికి వస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది .
టీడీపీ నుండి కొందరు కీలకనేతల్ని తమ పార్టీ లోకి రప్పించడానికి వైసీపీ కూడా ప్రయత్నిస్తుందట . ఈ ప్రయత్నం ఫలిస్తే మాత్రం టీడీపీ కనుమరుగవడం ఖాయం అంటున్నారు కొందరు రాజకీయ నిపుణులు