కరోనాకు ముందు ఏపీలో రాజధాని అమరావతి వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే… మొన్నటివరకు రాజధాని తరలింపు మూడు రాజధానులతో వ్యవహారంతో ఏపీ రాజకీయాలు వెక్కాయి…. ఇది ఇలా ఉండగానే ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రం కావడంతో అమరావతి వ్యవహారం కస్తా పక్కకు వెళ్లింది…
అయితే తాజాగా మరోసారి ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం చర్చకు తెరతీసింది… ముఖ్యంగా రాజధానికి నిర్మాణానికి అమరావతి పరిసర ప్రాంత రైతులు స్వచ్చందంగా ఇచ్చిన 33 వేల ఎకరాల్లో సుమారు నాలుగు వేళ ఎకరాల్లో అవకతవకలు జరిగాయని వైసీపీ సర్కార్ మొదటినుంచి అనుమానిస్తోంది…
దీంతో ఈ నాలుగు వేల ఎకరాల వ్యవహారాన్ని సీబీఐతో విచారణ చేయించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు విస్వసనీయ వర్గాల సమాచారం… దీనికోసం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది…ముఖ్యంగా టీడీపీ హయాంలో అక్రమాలు అవకతవకలు జరిగయని భావిస్తోంది సర్కార్… అందుకే సీబీఐని నియమించాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి…