ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ఎన్నికల్లో అధికార మార్పిడి తప్పని సరి జరుగనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన కొందరు టీడీపీ నేతలు పార్టీ ఓటమికి కారణం అవుతారని రాజకీయ మేధావులు అంటున్నారు.
మంత్రి హోదాలో ఉన్న వీరు పజా పక్షాణ ఉండకుండా కేవలం వారి స్పలాభంకోసమే ప్రయత్నించారు తప్ప ఎటువంటి అభివృద్ది కార్యక్రమాలు చేయలేదని అంటున్నారు. ఇందులో గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లోకి వచ్చే అనంతపురం, కర్నూల్, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మంత్రులు పార్టీ ఓటమికి ముఖ్య కారణం అవుతారని రాజకీయ మేధావులు అంటున్నారు.
ప్రభుత్వం నుంచి సదుపాయాలు సక్రమంగా వస్తున్నప్పటికీ మంత్రి కనుసన్నల్లో వాటిని పక్కదారి మళ్లించారనే అపవాదును ముటగట్టుకున్నారని అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గ్రేటర్ రాయలసీమలో టీడీపీ గెలుపు అంత ఈజీకాదని అంటున్నారు.