బ్రేకింగ్ — టీడీపీకి పీకే పై ఆశలు

బ్రేకింగ్ -- టీడీపీకి పీకే పై ఆశలు

0
95

ఇదేమిటి పీకే అంటే పవన్ కల్యాణ్ లేదా ప్రశాంత్ కిషోర్ అని అనుకుంటున్నారా.. అసలు పీకేకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటి అని ఆలోచన చేస్తున్నారా.. అవును మీరు విన్నది నిజమే పీకే అంటే ప్రశాంత్ కిషోర్ పవన్ కల్యాణ్ కాదు, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికల్లో పీకే చాలా ఉపయోగపడింది …ఇంతకీ ఆ పీకే అంటే పసుపు కుంకుమ.. మహిళలు ఈ పసుపు కుంకుమ కింద అందించిన డబ్బుతో మా చంద్రన్నకు తప్ప మేము వేరే వారికి ఓటు వేయము అని చెబుతున్నారు..

అలాగే ఇంటిలో పెద్దవారు వృద్దులకు పెద్ద కొడుగుగా పించన్లు ఇవ్వడం ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడంతో ఇవన్నీ బాబుకి మళ్లీ పట్టం కడతాయి అని చెబుతున్నారు.. అందుకే వీటిని అన్నింటిని తెలుగుదేశం పార్టీ తమకు పాజిటీవ్ అవుతుంది అని చెబుతోంది.. తాజాగా 13 జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ ఉండటం, వారు అందరూ పసుపు కుంకుమ కింద సాయం పొందడంతో తమకు కచ్చితంగా గెలుపు వస్తుంది అని ధీమాగా ఉన్నారు తెలుగుదేశం నేతలు.