ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేశారు
అందులోని అంశాలు –
ప్రతీ సంవత్సరం ఉద్యోగాలను భర్తీ చేస్తాం
ఇంటర్ పాసైన వారికి నిరుద్యోగ భృతి
కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు
రైతులకు పగటిపూట 12 గంటల పాటు ఉచిత విద్యుత్
రైతు ఉత్పత్తులకు నాణ్యమైన ధరలు లభించేలా చూస్తాం
40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఉద్యాన పంటలను కోటి ఎకరాలకు విస్తరింపు
గిరిజన రైతులకు ఐటీడీఏ ద్వారా ఉచితంగా విత్తనాలు, పెట్టుబడికి రాయితీలు ఇస్తాం
ఇంటర్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇస్తాం
నిరుద్యోగ భృతిని రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతాం.
అన్నదాతా సుఖీభవ పథకం ఐదేళ్లు అమలు
రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధి.
రైతులకు లాభసాటి ధరలు లభించేలా చర్యలు చేపడతాం
ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు అవసరమైన తాజా కూరగాయలు, పండ్లు సరఫరాకు ప్రత్యేక చర్యలు
మరో 50 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్పింక్లర్ వ్యవస్థల ఏర్పాటు
కోల్డ్ స్టోరేజీ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు