బాబు షాక్ వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే

బాబు షాక్ వైసీపీ గూటికి టీడీపీ ఎమ్మెల్యే

0
108

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాత్ తగిలేలా కనిపిస్తోంది. ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యే తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..

అందుకే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి ఇంట్లో పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం దర్శన మిచ్చారని అంటున్నారు… ఆయనతోపాటు కుమారుడు వెంకటేష్ కూడా హజరయ్యారు…ఆయన వైసీపీలో చేరేందుకు పుట్టిన రోజు సందర్భంగా మంతనాలు జరిపినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే మాగుంటమాత్రం కరణం బలరాం తనకు అన్నలాంటి వాడని అన్నారు.. కరణం ఇక్కడికి రావడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని అన్నారు తనకున్న సన్నిహిత్యం వల్లే కరణం ఈ వేడుకలకు హాజరయ్యారని అన్నారు