తమ ఆఫర్ ను జగన్ ఓకే చేస్తే వైసీపీలో చేరుతాం… ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు

తమ ఆఫర్ ను జగన్ ఓకే చేస్తే వైసీపీలో చేరుతాం... ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు

0
113

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారు… అయితే పార్టీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్ ప్రకారం తాము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెలిపారట..

కానీ తాము ఉప ఎన్నికల్లో పోటీ చేయమని స్పష్టం చేశారట… ఈ ఎన్నికల్లో చాలా ఖర్చు పెట్టామని అందుకే జగన్ మోహన్ రెడ్డి తమను ఆర్థికంగా ఆదుకుంటే చాలని అంటున్నారట… ఈ విషయంలో వైసీపీ అధిష్టానం భరోసా ఇస్తే తాము వైసీపీలో చేరుతామని క్లారిటీ ఇచ్చారట…

తాము ఆర్ధికంగా భరోసా ఇవ్వమని ఆ ఖర్చు కుడా తాము ఇవ్వమని తెల్చి చెప్పిందట వైసీపీ… కావాలంటే ఎమ్మెల్సీ ఇస్తామని క్లారిటీ ఇచ్చిందట… కాగా ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…