వైసీపీ దెబ్బకు ఈ సెగ్మెంట్లో టీడీపీ అవుట్

వైసీపీ దెబ్బకు ఈ సెగ్మెంట్లో టీడీపీ అవుట్

0
56

ఏకంగా ఎన్నిక‌ళ వేళ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌డ‌ము అలాగే తాము పోటి నుంచి త‌ప్పుకుంటున్నాం అనేలా కొంద‌రు పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇస్తున్నారు.. తాజాగా సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే అభ్య‌ర్దుల‌పై ప్ర‌క‌ట‌న చేయ‌డానికి వ‌డ‌పోత‌లు పోసి మూడు జాబితాలుగా ఎమ్మెల్యేల‌ను సెల‌క్ట్ చేసుకున్నారు. అయితే ఎమ్మెల్యేలుగా టికెట్ సంపాదించిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం నుంచి పార్టీ ఫిరాయిచి ఎమ్మెల్యే టికెట్ పొందారు బుడ్డారాజ‌శేఖ‌ర్ రెడ్డి, ఆయ‌న కూడా త‌న భార్య ఆరోగ్యం బాగాలేక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నాను అని తెలియ‌చేశారు.

మండ‌లాల వారీగా వైసీపీ బ‌లప‌డుతోంది ఈ స‌మ‌యంలో పోటీ చేసినా టీడీపీ ఓటమి ఖాయ మని తెలుసుకున్న బుడ్డా రాజశేఖరెడ్డి, పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిసింది. అయితే, తన భార్య అనారోగ్యం వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బుడ్డా రాజశేఖరెడ్డి తన అను చరులతో చెప్పుకుంటున్నారు.. అయితే వైసీపీ వేవ్స్ బాగా ఉండ‌టంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు అని అంటున్నారు వైసీపీ నేత‌లు. ఇటు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీ త‌ర‌పున చాలాయాక్టీవ్ గా ఉన్న విష‌యం తెలిసిందే.