తెలుగుదేశం పార్టీకి షాక్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా కారణం ఇదే

తెలుగుదేశం పార్టీకి షాక్ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా కారణం ఇదే

0
100

రాజధాని మూడు ముక్కలు అవుతోంది.. మూడు రాజధానుల నిర్ణయం తనకు బాధ కలిగించింది.. అందుకే తాను రాజకీయంగా పదవిలో ఉండలేను అని తెలుగుదేశం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. మండలిలో అధిక సంఖ్యా బలం ఉన్న తెలుగుదేశం పార్టీ, మూడు రాజధానుల బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సభ్యులంతా హాజరు కావాలని విప్ జారీ చేసిన వేళ ఆయన రాజీనామా లేఖ పంపించారు చంద్రబాబుకి.

అయితే ఆయన వేరే పార్టీలోకి వెళ్లే ఆలోచనలో లేరు.. రాజకీయంగా దూరంగా ఉంటాను అని తెలిపారు.. 2019 ఎన్నికల్లో పోటీ చేశాను కాని ఓటమి పాలయ్యాను.. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని లేఖలో రాశారు… నాకు సహకరించిన పార్టీ అధినేత చంద్రబాబు నారాలోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే మరే కారణం కాదు కేవలం రాజధాని విషయలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నాకు నచ్చక నేను రాజీనామా చేస్తున్నాను అని తెలిపారు ఆయన.. అయితే ఆయన వేరే పార్టీలోకి వెళ్లేది లేదని రాజకీయాలకు ఇక దూరంగా ఉంటారు అని తెలుస్తోంది.