టీడీపీ భారీ వ్యూహం జగన్ సర్కారుకి ఇక చుక్కలేనట

టీడీపీ భారీ వ్యూహం జగన్ సర్కారుకి ఇక చుక్కలేనట

0
102

టీడీపీ వైసీపీ సర్కారుపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉంది.. టీడీపీ ముందు నుంచి అమరావతి పై రాజధాని విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది.. తాజాగా టీడీపీ రాష్ట్ర విస్త్రృత స్థాయి సమావేశం ముగిసింది. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో స్టేట్ కు సంబంధించిన పార్టీ నేతలు పాల్గొన్నారు.

అంతేకాదు వైసీపీ సర్కారుని ప్రజల్లో నిలదీయాలని అన్నారు… నెల 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిల ఆధ్వర్యంలో టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ పై ప్రజల్లో సరికొత్త ఆలోచన వస్తుంది అనేది తెలుగుదేశం ఆలోచన.

అయితే టీడీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది…45 రోజుల పాటు ప్రజా చైతన్య యాత్ర నిర్వహణకు టీడీపీ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం అందుతోంది. 45 రోజులు ఈ చైతన్య యాత్ర చేయనున్నారు, ఇది స్ధానిక సంస్దల ఎన్నికల కంటే ముందు పూర్తి చేయనుంది టీడీపీ… ఇసుక కొరత పించన్ల కోత రేషన్ కట్ ఇలా అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని నిర్ణయించారు.