జమ్మలమడుగులో చేతులెత్తేసిన టీడీపీ

జమ్మలమడుగులో చేతులెత్తేసిన టీడీపీ

0
109

జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓపక్క రామసుబ్బారెడ్డితో ఆధినారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నా, కింది ఉన్న కేడర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే అనుమానం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డికి సపోర్ట్ చేయడం పై ఆయన కుటుంబం ఇంకా గుర్రుగానే ఉంది.. అంతేకాదు రామసుబ్బారెడ్డి కూడా బాబు మాటకై ఎన్నికల్లో ఇలా ప్రచారం చేస్తున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు.

మరో పక్క వైసీపీ తరపున డాక్టర్ సుధీర్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేరుగా టీడీపీకి ఇక్కడ ఓటు బ్యాంకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నాయి సర్వేలు.. దీనికి కారణం వైసీపీ వేవ్స్ బలంగా ఉండటం. పైగా గత ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి పార్టీ మారడం అని అంటున్నారు. అంతేకాదు పార్టీ మారినా ఇక్కడ జరగాల్సిన అభివ్ఱుద్ది ఏమీ జరగలేదు అని విమర్శలు వస్తున్నాయి. కాని సొంత అభివ్ఱుద్ది జరిగింది అని వారిపై విమర్శలు చేస్తున్నారు సీమకు తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ చేసింది ఏమీ లేదు అని జమ్మలమడుగు పులివెందుల అంటే, వైయస్ కుటుంబాలకు రాజకీయంగా కీలక ప్రాంతాలు అని ఇక్కడ వైసీపీ గెలుపు పక్కా అంటున్నారు నేతలు.