ఆంద్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం హిందువులు మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు… పవిత్రమైన తిరుమల తిరుపతి దేవాలాయ సమీపంలో వెంకటేశ్వర స్వామితో పాటు ఇతర హిందూ దేవాలయాలు ఉన్న చోట అన్యమత ప్రచారం ఎక్కువ అయిందని అన్నారు..
తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువ అయిందని ఇక నుంచి వైసీపీ పోకడలను సహించేదిలేదని అన్నారు. అంతేకాదు సర్కార్ దీనిపై వెంటనే చర్యలు చేపట్టకపోతే ఉద్యమిస్తామని ఉమా హెచ్చరికలు జారీ చేశారు..