బీజేపీలోకి తీన్మార్ మల్లన్న..ముహూర్తం ఫిక్స్

Teenmar Mallanna into BJP..moment fix

0
95

ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత చింతపండు నవీన్‌కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఈ నెల ఏడో తేదీన తాను ఢిల్లీలో బీజేపీలో చేరుతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.

బిజెపిలో చేరేందుకు అన్ని అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాయని. డిసెంబర్ 7వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు మల్లన్న ట్వీట్ చేశారు. మోడీ సిద్ధాంతాలకు తాను ఆకర్షితునుడైనట్లు..ఈ నేపథ్యంలోనే బిజెపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు మల్లన్న.

ఓ స్వామిజీని, అలాగే తెలంగాణ ప్రభుత్వంపై చేసిన ఆరోపణల నేపథ్యంలో మల్లన్నను అరెస్ట్ చేసారు. తీన్మార్ మల్లన్నపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదు కాగా 6 కేసులను కోర్టులు కొట్టేశాయి. మరో 32 కేసులకు సంబంధించి 31 కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైల్లో 74 రోజులు పాటు రిమాండ్‌లో ఉన్న ఆయన నవంబర్ తొలి వారంలో విడుదలైన సంగతి తెలిసిందే.

తీన్మార్ మల్లన్న జైలులో ఉన్న సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు అండగా నిలిచారు.  ఈ క్రమంలోనే మల్లన్న భార్యను ఢిల్లీ తీసుకెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేయించారు. ఈ పరిణామాలతోనే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే మంగళవారం (డిసెంబర్ 7) బీజేపీలో చేరనున్నట్లు మల్లన్న అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన నల్లగొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్​లో ఇండిపెండెంట్​గా పోటీ చేసి రెండో ప్లేస్​లో నిలిచిన సంగతి తెలిసిందే.