జగన్ కు జై కొట్టిన టీజీ వెంకటేష్

జగన్ కు జై కొట్టిన టీజీ వెంకటేష్

0
81

బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ఏవైతే అమలు చేయాలనుకున్నారో అవే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు..

తన తండ్రి ఆశయాలను అనుగునంగా జగన్ అమలు చేస్తున్నారని ప్రశంశలు కురిపించారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు… రాయలసీమ అభివృకి ఆమడ దూరంలో ఉందని అన్నారు. అందుకే జగన్ కర్నూల్ జిల్లాలో రాజధాని, హైకోర్టును ఏర్పాటు చేయాలని టీజీ కోరారు .. రాజధాని ఏర్పాటుకు కర్నూల్ జిల్లాలో వేల ఎకరాలు ఉందని అన్నారు…

ఇంకా కావాలనుకుంటే రైతులు స్వచ్చంగా భూములు ఇచ్చేందుకు రేడీగా ఉన్నారని తెలిపారు… కర్నూల్ జిల్లాకు రాజధాని హైకోర్టు ప్రకటిస్తే అభివృద్ది చెందుతుందని అన్నారు… సీమ అభివృద్దికోసం కేంద్రం ముందుకు వస్తుందని తెలిపారు.. కాగా టీజీ వెంకటేష్ ఇటీవలే టీడీపీకి గుడ్ భై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే