వైసీపీలోకి ఎంపీ భార్య జగన్ టికెట్

వైసీపీలోకి ఎంపీ భార్య జగన్ టికెట్

0
104

ఎన్నికల వేళ జంపింగ్ లు బాగా పెరిగిపోతున్నాయి.. అక్కడ టికెట్ రాదు అనుకుంటే వేరే పార్టీలో కర్చీఫ్ వేయడం, అనేది ఎన్నికల సమయంలో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది వైసీపీ జనసేన వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల సమయంలో వైసీపీలోకి ఇప్పటికే ఫ్రిబ్రవరి నుంచి భారీగా చేరికలు జరిగాయి. వైసీపీలో మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఓ ఎంపీ కుటుంబం సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీలోకి వస్తోంది అని తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహంతో సహా ఆయన కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఆ కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయను అని తెలియచేశారు. ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని చంద్రబాబుని కోరారు.. కాని టికెట్ పై హమీ ఇవ్వకపోవడంతో ఆయన ఈ కీలక నిర్ణం తీసుకున్నారు అని తెలుస్తోంది. .కాకినాడ సిటీ, పెద్దాపురం అసెంబ్లీ స్థానాల్లో…ఏదో ఒక స్థానం నుంచి వైసీపీ తరపున తోట వాణి బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇక ఆయన ఆరోగ్యపరంగా రాజకీయాల నుండి దూరంగా ఉండాలి అని చూస్తున్నారు.

నరసింహం సతీమణి వాణి, కుమారుడు రామ్జీ, ఇతర అనుచరులతో గతంలో సీఎంను కలిశారు..తన భార్యకు జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు, కాని ఇక్కడ జ్యోతుల నెహ్రుకు మరోసారి అవకాశం ఇస్తుండటంతో చేసేది లేక ఆయన పార్టీ మారాలి అని నిర్ణయం తీసుకున్నారు.