ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

The AP government is a key decision for them

0
118

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర కేబినెట్ కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ మరో రెండు జీవోలను జారీ చేసింది.