ఏపీ ప్రభుత్వం శుభవార్త..ఈ నెల 28న ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం

0
97

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పేద ప్రజలకు ఆసరా కల్పించాలనే ఉదేశ్యంతో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 31 లక్షల మందికి ఇళ్ళు ఇస్తున్నట్లు తెలిపారు.

పేదల కలలను నెరవేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మొదటి విడతలో 15.6 లక్షల మందికి ఇళ్ళ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ పనిని ఒక బాధ్యతగా తీసుకొని పనులు శరవేగంగా పూర్తి చేయాలనీ అధికారులకు తెలిపారు. ఈనెల 28న విశాఖలో లక్ష మందికి ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు.

ఈ నెల 28న రెండవ విడతగా 1.5 లక్షల మహిళలకు ఇళ్ళ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ళపై కొందరు కోట్లను ఆశ్రయించిన తీర్పు మాత్రం ప్రభుత్వానికి సానుకూలంగా రావడం ఆనందకరం అని వెల్లడించారు. ఇళ్ళ నిర్మాణం పనిని తొందరగా పూర్తి చేసి తమ కళలను నెరవేరుస్తామని మంత్రి జోగి రమేష్ హామీ ఇచ్చారు.