దేశంలో నెంబర్ వన్ అవినీతి పరుడు కేసీఆరే- డాక్టర్ చెరుకు సుధాకర్

0
43

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ సీఎం కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డాడు. సీఎం కేసీఆర్ పై మరోసారి తిట్ల పురాణాన్ని గుప్పించాడు. గురువారం ఇంటి పార్టీ 5వ ఆవిర్భావ వేడుకలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదర్శర్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ కారులు నేడు అనాధలుగా మిగిలారాన్నరు. ఉద్యమ కారులు తమ హక్కుల సాధనకు గొంతు పెంచాలన్నారు. భవిష్యత్ లో ఉద్యమకారులకు ఇంటి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దేశంలోని అవినీతి ముఖ్యమంత్రులలో చంద్రశేఖర్ రావు నెంబర్ 1 స్థానంలో ఉన్నాడని అతడిని ఎవ్వరు గుడ్డిగా నమ్మొద్దని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ఆరోపించారు.

రాష్ట్రంలో ఉన్న నయీమ్, డేరా బాబా భూములు ఉద్యమకారులకు పంచాలన్నారు. రాష్ట్రంలోని దవాఖానల్లో గంటకు 100 కేసుల్లో 70 కేసులు మద్యం తాగి ఆరోగ్యం చెడిన వారేనన్నారు. రాష్ట్రంలో మద్యంపై వచ్చే కమిషన్లతో రాష్ట్రం బతికే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై పీడీ యాక్ట్ పెట్టడం పై హైకోర్టు మొట్టికాయలు వేసిందని అన్నారు. దేశంలో ఉద్యమకారులపై తొలి పీడీ యాక్ట్ తనపైనే నమోదు అయ్యిందన్నారు. విఫల నాయకుడు కెసిఆర్ అని విమర్శించారు. ముఖ్యమంత్రికి కప్పం చెల్లెస్తే చాలు ఎవరైనా రాష్ట్రాన్ని దోచుకోవచ్చని అన్నారు. రాజ్యాసభకు ఉద్యమ ద్రోహులు, ల్యాండ్, డ్రగ్, మైనింగ్ మాఫియా నాయకులను పంపిన ఘనత కెసిఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టం కోసం కొట్లడిన ఉద్యమకారులను అన్ని పార్టీలు అనాథలను చేశాయని ఆవేదన వ్యక్తం చేసాడు.

అది తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన తెచ్చినం అని చెప్పుకునే పార్టీలు అయిన ఉద్యమకారులకు అన్యాయం చేశాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారుల కోసం ఒక సంక్షేమ నీది ఏర్పాటు చేస్తే ఎంపోతుందనీ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. శివాలు, శవాలు అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్ కి మతి పోయింది అని అనిపిస్తున్నారు. కెసిఆర్ తనకు తానే ప్రతిపక్షాన్ని తయార్ చేసుకుంటున్నారని దానికి బీజేపీ, MIM పార్టీలు సహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కో-ఆర్డినేటర్ దోరం హరీష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య గౌడ్, ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ అధ్యక్షులు కుందూరి దేవేందర్ రెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు తిరుపతి రెడ్డి, యువజన విభాగం సందీప్ చమర్, విద్యార్థి విభాగం సత్యనారాయణ పాల్గొన్నారు.