ఈ జిల్లాల్లో టీడీపీ టు లెట్ బోర్డు పెట్టనుందా…

ఈ జిల్లాల్లో టీడీపీ టు లెట్ బోర్డు పెట్టనుందా...

0
84

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు తమ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు… మరికొందరు టీడీపీ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు…

మరికొన్నిచోట్ల టీడీపీకి నాయకులు కరువయ్యారు… ముఖ్యంగా ఈ కొరత కడప జిల్లాలో ఎక్కువగా ఉంది సీఎం రమేష్ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు వంటి వారు టీడీపీని వదిలి బీజేపీలో చేరారు… రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీని వీడే ఛాన్స్ ఉందని అంటున్నారు రాజకీయ మేధావులు.. దీంతో జిల్లాలో నేతలకొరత ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు…

కాగా 2014 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలు ఉంటే వైసీపీ 9 కైవసం చేసుకుంది… కేవలం రాజంపేటలో మాత్రమే టీడీపీ జెండా ఎగిరింది… ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది… పదికి పది స్థానాలను వైసీపీ కౌవసం చేసుకుంది…