ఆ లేడీ లీడర్ కు చంద్రబాబు నో ఛాన్స్…

ఆ లేడీ లీడర్ కు చంద్రబాబు నో ఛాన్స్...

0
42

ఏపీ సర్కార్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినా… వాటిని చేపట్టడంలో నాయకులు విఫలమయ్యారని తానే కొన్ని సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు… వాటివెనుక అసంతృప్తులు కావచ్చు… మరేదైనా కావచ్చు… నాయకులు మాత్రం ముందుకు రావడంలేదు…. ఈ సమయంలో నేనున్నాను పార్టీ నడిపిస్తాను అని చెప్పే నాయకులను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదనే అపవాదు ఇప్పుడు వినిపిస్తుండటం గమనార్హం…

ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గాకి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారతి తనయురాలు గ్రీష్మ రాజకీయాల్లోకి వచ్చారు… తన తల్లి వారసత్వంగా రాజకీయ అరంగేట్రం చేసిన గ్రీష్మ గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించారు… అయితే అప్పటికే పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండ్రుమురళి టీడీపీ సైకిల్ ఎక్కిన నేపథ్యంలో గ్రీష్మను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు…

ప్రతిభా భారతి రాజకీయాలకు దూరం కావడంతో చంద్రబాబు గ్రీష్మ రాజకీయ భవిష్యత్ తనకు వదిలేయమని చెప్పి కోండ్రుకు సీటుఇచ్చారు… గత ఎన్నికల్లో పోటీ చేసినా కూడా కొండ్రు ఓటమి చెందారు… ఓటమి తర్వాత కొండ్రు మురళి నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు… అన్ని కుదిరితే వైసీపీలో చేరాలని చూస్తున్నారట… దీంతో రాజాంను పట్టించుకునే నాధులు కరువయ్యారు… ఈక్రమంలో ఇక్కడ పార్టీని నడిపిస్తానని తనకు పగ్గాలు అప్పగించాలని గ్రీష్మ కోరుతొంది… అయినా కూడా ఆమెకు ఇంత వరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు…