మూడు పెళ్ళిళ్లపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలు

మూడు పెళ్ళిళ్లపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలు

0
86

అమరావతికి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగాలో ఎగ్జిగ్యూటివ్ క్యాపిటల్ అలాగే కర్నూలు జిల్లాలో జ్యూడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు… ఈ ప్రకటనకు అన్ని వర్గాలనుంచి కూడా మంచి స్పందన వస్తోంది…

టీడీపీకి చెందిన కొందరు నేలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి తమ ప్రాంతానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు… అయితే తాజాగా మూడు రాజధానుల ప్రకటన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు…

రాష్ట్రం ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మూడు రాజధానులు ఏర్పడితే న్యాయవాదులు అంతా మూడు పెళ్ళిళ్లు చేసుకోవాలన్నారు… కర్నూల్ హైకోర్టు విజయవాడ విశాఖ హైకోర్టు బెంచిల్లో న్యాయవాదులు పనిచేయాలంటే ఒక్కొక్కరు మూడు వివాహాలు చేసుకోవాలని అనుచిత వ్యాఖ్యలు చేశారు…