మూడు రాజధానుల రాష్ట్రంపై చంద్రబాబు కామెంట్స్

మూడు రాజధానుల రాష్ట్రంపై చంద్రబాబు కామెంట్స్

0
79

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే… వికేంద్రీకరణ దిశగా రానున్న రోజుల్లో ఏపీలో మూడు రాజధానులుగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు… అమరావతిలో లెజిస్లేటర్ క్యాపిటల్ రావచ్చు, విశాఖ పట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూల్ జిల్లాలో జుడిషియల్ క్యాపిటల్ రావచ్చని జగన్ అన్నారు…

దినిపై చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు… జగన్ పాలన్ తుగ్లక్ పాలనగా ఉందని ఎద్దేవా చేశారు… మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఉండాలని అన్నారు… రాష్ట్రం ఏదిశగా పయణిస్తుందో అర్ధం కాకుందని అన్నారు… మూడు రాజధానులు ప్రకటించడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారని అన్నారు…

జగన్ అమరాతిలో ఉంటారా లేక విశాఖలో ఉంటారా అని ప్రశ్నించారు…. సర్కార్ నిర్ణయం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు… కాగా మరోవైపు జగన్ ప్రకటనకు మాజీ మంత్రి గంటాశ్రీనివాసరావు స్వాగతించిన సంగతి తెలిసిందే…