నేడు టాలీవుడ్ ప్రముఖుల కీలక భేటీ

0
95

టాలీవుడ్ చిత్ర పరిశ్రమను గతకొన్ని రోజులుగా అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని సమస్యలపై సినీ పెద్దలు చర్చించే అవకాశం ఉంది. థియేటర్ల టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంతో పాటు..ఇతర సమస్యలపై ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చించారు. ఇప్పుడు మళ్లీ తెలుగు సినీ ప్రముఖులు సమావేశం కాబోతున్నారు.

‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు సినీ పెద్దలు మోహన్ బాబు, చిరంజీవి, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ సహా ఇతర ప్రముఖులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్​తో చిరంజీవి భేటీ కంటే ముందు ఈ సమావేశం జరగాల్సి ఉండగా రెండుసార్లు వాయిదా పడింది.

ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో ఈ సమావేశం జరగనుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమ సమస్యలు, ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందిస్తూ ఈ నెలాఖరులో ఉత్తర్వులు జారీ చేయనున్న క్రమంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇవాళ సమావేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.