ట్రంప్ మోదీకి ఫోన్ ప్లీజ్ మాకు అవి పంపించండి ?

ట్రంప్ మోదీకి ఫోన్ ప్లీజ్ మాకు అవి పంపించండి ?

0
99

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది… అగ్రరాజ్యమే కరోనాలో అగ్రభాగాన ఉంది, ఎక్కువ కేసులు అక్కడే నమోదు అయ్యాయి, అయితే అక్కడ అధ్యక్షుడు ట్రంప్ ఇకనైనా అమెరికాని లాక్ డౌన్ చేయాలి అని చాలా మంది చెబుతున్నారు.

ఈ సమయంలో ట్రంప్ మన దేశ ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు..భారత్లో కరోనా వైరస్ నివారణకు ప్రివెంటివ్ ఔషధంగా వినియోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్ను అమెరికాకు ఎగుమతి చేయాల్సిందిగా ప్రధాని మోదీని ట్రంప్ కోరారు.

అమెరికా ఆర్డర్ చేసిన వరకైనా పంపాలని మోదీకి చెప్పారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను, భారత్కు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. హైడ్రాక్సిక్లోరోక్విన్ను మలేరియా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ నివారణ చికిత్సకు వినియోగిస్తారు.. ఇది బాగా ఉపయోగపడుతుంది అని డాక్టర్స్ తెలిపారు, అందుకే ట్రంప్ అడిగారు అని తెలుస్తోంది.