మొత్తానికి ఎవరు ఎలాంటి సర్వేలు చెప్పినా ఓపక్క ఉండవల్లి లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి ఎలా వస్తాయి అని చెబుతారో అని ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ తన మాట ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.. ఈ సారి ఎన్నికలు దేశంలో ఎక్కడా జరుగని విధంగా జరిగాయి. ఎన్నికల ముందు మహిళలకు పసుపు కుంకుమ కింద డబ్బులు వేయడం పెద్ద సెన్సేషన్ అని అన్నారు.. అయితే మొత్తానికి ఇలా తెలుగుదేశం వైసీపీ హామీలు ఇచ్చుకుంటూ వెళ్లాయి. ప్రజలు మైండ్ సెట్ అంత సులువుగా చెప్పలేము అన్నారు.
ఎన్నికలకు రెండు నెలలు ముందు వరాలు ఇచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రే ప్రజలు టీడీపీ వైపు టర్న్ అవుతారని అనుకుంటే అది పొరపాటే అని ఆ విషయం 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియంది కాదని ఉండవల్లి అన్నారు. లగడపాటి సర్వే కూడా కరెక్ట్ గా ఉంటుంది తెలంగాణలో ఫెయిల్ అయింది అని తీసిపారేయ్యలేం అని తెలియచేశారు ఆయన.. అయితే లగడపాటి సర్వే బాబుకు అందింది అని ఆయన దానిని పట్టుకుని తామే గెలుస్తాం అని చెబుతున్నారు ..అంతేకాని టీడీపీకి అవకాశాలు తక్కువ ఉన్నాయి అని అన్నారు.. మొత్తానిక మహిళలు పెద్ద ఎత్తున ఓటు తెలుగుదేశానికి వేస్తేబాబు భారీ మెజార్టీతో గెలవడం పక్కా అని ఇప్పటికే పలువురు విశ్లేషకులు కూడా తెలియచేశారు.