ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది

0
104

ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాలు తప్పక గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివరం హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ప్రజాకూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ జాతీయ చానెళ్లు బీజేపీ పార్టీ పట్ల పక్షపాతం వహిస్తున్నాయని.. అందుకే నిన్న ప్రకటించిన ప్రీ పోల్ సర్వేలలో అటు బీజేపీకి ఇటు తెరాసకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయన్నారు. అయితే, నేషనల్ ఛానెళ్ల ఫలితాలను చూసి కంగారు పడవద్దన్నారు.. ముందునుంచి ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. అందుకే ఎన్నికల ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా రావడం ఖాయమన్నారు.. డిసెంబర్ 12 న ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్న ఉత్తమ్ తాను గడ్డం తీసే సమయం దగ్గర పడిందన్నారు. టీడీపీతో పొత్తు గ్రేటర్ పరిధిలో కూటమికి కలిసివచ్చిందరి అయన అన్నారు. నూటికి నూరుపాళ్లు తమ గెలుపు మీద ధీమా ఉందన్నారు. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్ద తమ పార్టీ నేతలకు కూడా అనుమతి ఇవ్వలన్నారు. ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూముల్లోకి అధికారులు కూడా వెళ్లకూడదని, ఆ రూమ్ లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ చాలా తప్పులు చేసిందని.. మొదట నుండి తమ నేతలు ఓటర్ల జాబితా తప్పులున్నాయని చెప్పినా వారు వినిపించుకోలేదన్నారు.