విశాఖ లో అఖిల్ సందడి

విశాఖ లో అఖిల్ సందడి

0
97

విశాఖలో అక్కినేని అఖిల్ సందడి చేశారు.విధ్యార్ధులతో ఎంజాయ్ చేస్తూ జోష్ పెంచారు.విశాఖ గీతం డీమ్డ్‌ వర్సిటీ వేదికగా రెండురోజుల పాటు జాతీయస్థాయిలో నిర్వహించిన యువజనోత్సవాల ముగింపు అదరహో అనే రీతిలో సాగింది.దీనిలో సినీ హీరో అఖిల్‌ విద్యార్థుల చిట్ చాట్ విశేషంగా ఆకట్టుకుంది.వైజాగ్‌ అంటే తనకెంతో ఇష్టమంటూ విద్యార్ధులను అఖిల్ ఉర్రూతలూగించారు.యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు.కాలేజీ రోజులు మరపురానివని చెప్పిన అఖిల్ విద్యార్ధుల డ్యాన్సులకు ఫిదా అయ్యారు.అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అలరించాయి. యువజనోత్సవాల్లో భాగంగా వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రొబవీసీ ఆచార్య కె.శివరామకృష్ణ, ప్రిన్సిపల్‌ ఆచార్య పి.షీలా బహుమతులు అందజేశారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్‌ కూడా ఈ ఈవెంట్ లోపాల్గోన్నారు.