టీడీపీ లో ఆ ఎమ్మెల్యే విక్టరీ షురూ

టీడీపీ లో ఆ ఎమ్మెల్యే విక్టరీ షురూ

0
115

పుచ్చలపల్లి సుందరయ్యలాంటి హేమా హేమీ నాయకులు ప్రాతినిధ్యం వహించిన సెగ్మెంట్ అది.. అదే కృష్ణాజిల్లాలోని గన్నవరం సెగ్మెంట్.. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అలాగే వైసీపీ తరపున యార్లగడ్డ వెంకటరామారావులు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది.. వల్లభనేని రాజకీయంగా ఫేమ్ ఉంది.. ఓటు పరంగా కేడర్ ఉంది. ఇక యార్లగడ్డకు మాత్రం ఆర్ధికంగా అండదండలు ఉన్నాయి. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఉన్నారు. మరి వీరి ఇద్దరి మధ్య ఎలాంటి రాజకీయ ఫైట్ ఉంటుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇరువురు పార్టీల తరపున ప్రచారాలు చేస్తున్నారు.. ఇటు జగన్ అండదండలు యార్లగడ్డకు ఉంటే అటు బాబు నుంచి ఆశీస్సులు వల్లభనేనికి పుష్కలంగా ఉన్నాయి.. జిల్లాలో యువనాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఆయన.

గత ఎన్నికల్లో వంశీ వైసీపీ అభ్యర్దిదుట్టా రామచంద్రరావు పై గెలుపొందారు.. ఈసారి మాత్రం అభ్యర్ది మారి వంశీని ఓడించాలి అని వెంకటరావుని తెరపైకి తీసుకువచ్చారు. ఇక్కడ బీసీ కమ్మ ఓటు బ్యాంకు మొత్తం వంశీకి ప్లస్ అవుతున్నాయి .ఈ సమయంలో వంశీకి పాజిటీవ్ ప్రచారం ఉంది. అయితే వైసీపీకి ఇక్కడ సర్వేల్లో కూడా నెగిటీవ్ మార్కులు రావడం, ఇప్పుడు వంశీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పధకాలు మరోసారి వంశీకి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తాయి అటున్నారు ఇక్కడ తెలుగుదేశం నేతలు.

అలాగే పోలవరం కుడి కాల్వ ద్వారా వెళుతున్న పట్టిసీమ నీటిని నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల పంటకు అందించటానికి సొంత నిధులను ఖర్చు చేసి మోటార్లను ఏర్పాటుచేయడం, ప్రజాహిత కార్యక్రమాలు తనకు కలిసి వస్తాయని వంశీ బలంగా నమ్ముతున్నారు. కేవలం సంవత్సరం నుంచి మాత్రమే ఇక్కడ యార్లగడ్డ రాజకీయాలుచేస్తున్నారు …తాను మీ వాడిని అంటూ వంశీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందుకే ఇక్కడ జనం కూడా వంశీకి పక్కా విక్టరీ అంటున్నారు.