వైసీపీలోకి వంగవీటి ఫలించిన రాయబారం

వైసీపీలోకి వంగవీటి ఫలించిన రాయబారం

0
68

ఎన్నికల వేళ అనేక పరిణామాలు జరుగుతాయి ..ఇప్పుడు ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎన్నికల హీట్ కనిపించడంతో పాటు రాజకీయంగా పోటీ కూడా పార్టీల మధ్య నాయకుల మధ్య కనిపిస్తోంది. ముఖ్యంగా వంగవీటీ రంగా అభిమానులు అందరూ వైసీపీ నుంచి రాధా రావడంతో షాక్ అయ్యారు.. ఆయన జనసేనలో చేరుతారు అని అనుకున్నారు. కాని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం షురూ అనేసరికి కాస్త కంగుతిన్నారు. ఈ సమయంలో వంగవీటి సోదరుడు ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి. వంగవీటి రాధా పార్టీని వీడిన తర్వాత జగన్ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం లేపాయి. ఇక వంగవీటి రాధాకు చెక్ పెట్టెందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు వైసీపీ నేతలు. ఈసమయంలో రాధా తమ్ముడు నరేంద్రని వైసీపీలో చేర్చుకోవాలి అని చూస్తున్నారు.

దివంగత నేత వంగవీటి రంగా సోదరుడు వంగవీటి నారాయణరావు కుమారుడే ఈ వంగవీటి నరేంద్ర. వంగవీటి ఫ్యామిలీ నుండి యువనేతగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ యువనేత, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈయనని తీసుకుని రాధాకు చెక్ పెట్టాలి అని చూస్తున్నారు జగన్..ఇక వంగవీటి నరేంద్ర టీడీపీకి ఫుల్ యాంటీగా ఉంటారు, పలుసార్లు తన వాయిస్ వినిపించారు. ఈసమయంలో ఆయనని క్యాంపెయినింగ్ కు వాడుకుంటే పార్టీకి మరింత ఉపయుక్తం అవుతుంది అని చూస్తున్నారు.. త్వరలో తన అభిమానులతో భేటీ అయి నిర్ణయం చెబుతాను అని తెలియచేశారట. మరి ఆయన వైసీపీలో చేరితే ఎలాంటి పరిస్దితి ఉంటుందో అని కొందరు రాధా ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారు.