బాబు పై వర్మ మరో సంచలన పోస్టు

బాబు పై వర్మ మరో సంచలన పోస్టు

0
173

రాజకీయం సినిమా, ఈ ఎన్నికల్లో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అనే చెప్పాలి.. సినిమా అంటే – అదే వర్మ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మరి ఈ సినిమాలో వర్మ బాబు షేడ్స్ ఎలా చూపిస్తున్నాడో ,సాంగ్స్ ట్రైలర్స్ చూస్తూ ఉంటే తెలుస్తుంది. మరి ఇప్పుడు రోజుకో సంచలన సృష్టిస్తున్నాడు వర్మ… అసలు వర్మ ఈ సినిమాకి ప్రమోషన్ ఓ రేంజ్ లో వీరిని వాడుతున్నాడు అని చెప్పాలి. మంచు మోహన్ బాబు తాజాగా వర్మ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు. అంతే కాదు ఈ సమయంలో ఓ క్యాప్షన్ కూడా దానికి పెట్టారు.

చంద్రబాబు ఇలాంటి వాడు అనుకోలేదు అంటూ ఫేస్ బుక్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. మరి ఇప్పుడు ఇదే పెద్ద సంచలనం అయింది.. వర్మ ఏమిటి , మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కాబట్టి ఇలాంటి పోస్టు పెట్టి బాబుతోనే ప్రచారం చేస్తున్నాడు అని అంటున్నారు. మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ అంతా సోషల్ మీడియాలోనే జరుగుతున్నాయి… ఎన్నికల సమయం కాబట్టి మొత్తం దీని గురించే చర్చ అయితే జరుగుతోంది.. ఏపీలో ఎలా ఉన్నా తెలంగాణలో ఈసినిమా 29 మార్చిన విడుదల అయి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుస్తుంది అంటున్నారు.