ఫలించిన విజయసాయిరెడ్డి ప్లాన్ వైసీపీలోకి టీడీపీ బిగ్ వికేట్

ఫలించిన విజయసాయిరెడ్డి ప్లాన్ వైసీపీలోకి టీడీపీ బిగ్ వికేట్

0
96

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నేతల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది… ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో ఆ పార్టీ నేతలు నెమ్మదిగా ఒకరొకరు జారుకుంటున్నారు… ఇప్పటికే నలుగు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం తీసుకోగా ఇటీవలు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.

ఇక ఇదే క్రమంలో మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కూడా వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసున్నారు… ఇటీవలే పార్టీ నేత విజయసాయిరెడ్డి విశాఖ పర్యటణలో ఉన్నప్పుడు ఆయనతో పార్టీలో చేరే విషయం గురించి రమేష్ చర్చించి నట్లు తెలుస్తోంది.

ఇక అన్ని వైపుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విజయ దశమి రోజు నాటికల్ల ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకుని జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాలని రమేష్ బాబు అనుకుంటున్నారట.